Advertisementt

వాయిదాపడిన బ్రూస్‌లీ ఆడియో..!

Tue 22nd Sep 2015 05:30 AM
brucelee,ramcharan,sreenuvaitla,kanche,varuntej  వాయిదాపడిన బ్రూస్‌లీ ఆడియో..!
వాయిదాపడిన బ్రూస్‌లీ ఆడియో..!
Advertisement
Ads by CJ

రామ్‌చరణ్‌ హీరోగా, రకుల్‌ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా మెగాస్టార్‌ చిరంజీవితో పాటు పలువురు ప్రముఖ నటీనటులు కలిసి నటిస్తున్న చిత్రం బ్రూస్‌లీ. ఈ చిత్రానికి శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తుండగా, డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నాడు. కాగా తమన్‌ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియోను సెప్టెంబర్‌ 26న విడుదల చేస్తారంటూ వార్తలు వచ్చాయి. కానీ ఈ వేడుక అక్టోబర్‌2కు వాయిదాపడింది. గాంధీ జయంతి సందర్భంగా ఈ వేడుక అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా జరుగనుందని సమాచారం. అయితే అదే రోజున మరో మెగాహీరో వరుణ్‌తేజ్‌ నటించిన కంచె చిత్రం విడుదలవుతున్న సంగతి తెలిసిందే. మరి మెగాభిమానులు మొదటి రోజే కంచె ను చూస్తారా? లేక రామ్‌ఛరణ్‌ ఆడియో వేడుకకు తరలి వెళ్తారా? అనే సందిగ్ధం మాత్రం కొనసాగుతోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ