Advertisementt

అయ్యబాబోయ్‌ తమన్‌..!

Tue 22nd Sep 2015 04:51 AM
thaman,dictator,balakrishna,bhajarangi bhaijaan  అయ్యబాబోయ్‌ తమన్‌..!
అయ్యబాబోయ్‌ తమన్‌..!
Advertisement
Ads by CJ

సంగీత దర్శకుడు తమన్‌ కాపీ ట్యూన్లకు ప్రసిద్ది. ఇంగ్లీషు ఆల్బమ్‌లోని ట్రాక్స్‌ని యదేచ్చగా ఎత్తేస్తూ... తెలుగులో పాటలు కంపోజ్‌ చేస్తూ ఉంటాడు. అయితే అనూహ్యంగా అవి మాస్‌ప్రేక్షకులకు బాగా ఎక్కుతుండటంతో ఆయనకు తిరుగులేకుండా పోతోంది. మొత్తానికి మాస్‌కు నచ్చే ట్యూన్స్‌ ఇస్తున్నాడు కాబట్టి స్టార్‌ హీరోలు కూడా తమన్‌నే సంగీత దర్శకునిగా పెట్టుకుంటున్నారు. దీంతో ఆయన కాపీకి ఎదురుబెదురులేకుండా పోయింది. తాజాగా బాలకృష్ణ డిక్టేటర్‌ కోసం తమన్‌ కంపోజ్‌ చేసిన పాట కూడా కాపీ ట్యూన్‌ అనే తేలింది. వినాయక చవితికి డిక్టేటర్‌లోనిఆ గం గం గణేషా... పాట రిలీజ్‌ చేశారు. ఈ పాటను ఒకటికి రెండు సార్లు శ్రద్దగా వింటే భజరంగీ భాయిజాన్‌లో సెల్ఫీ లేలో పాట ట్యూన్‌ తరహాలో సాగిపోతుంది. మరి తమన్‌ ఇలా కాపీలు కొట్టుకుంటూ ఎంతకాలం తన బండిని నడిపిస్తాడో ఆయనకే తెలియాలి...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ