Advertisementt

మూడో కృష్ణుడు వచ్చిచేరాడు..!

Mon 21st Sep 2015 07:11 AM
koratala siva,mahesh babu,prabhas,allu arjun,raviteja  మూడో కృష్ణుడు వచ్చిచేరాడు..!
మూడో కృష్ణుడు వచ్చిచేరాడు..!
Advertisement
Ads by CJ

రెబెల్‌ వంటి ఫ్లాప్‌ చిత్రం తర్వాత మిర్చితో ప్రబాస్‌కు. 1(నేనొక్కడినే), ఆగడు చిత్రాల ఫ్లాప్‌ల తర్వాత మహేష్‌కు శ్రీమంతుడు తో అదిరిపోయే హిట్లు ఇచ్చాడు కొరటాల శివ. కాగా ఆయన తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్‌తో చేస్తాడా? లేక అల్లుఅర్జున్‌తో చేస్తాడా? అనేది ఇంకా తేలలేదు. అయితే ఈ ఇద్దరితో కాకుండా కొరటాల శివ తన తదుపరి చిత్రాన్ని మాస్‌మహారాజా రవితేజతో చేస్తాడనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి కొరటాలకు రవితేజతో భద్ర చిత్రం నుండి మంచి సాన్నిహిత్యం వుంది. అందులోనూ ఇప్పుడు రవితేజ ఇమేజ్‌ తగ్గిపోయి ఒక మెట్టు దిగిపోయాడు. ఈసమయంలో కొరటాల తనకు మరలా పూర్వ వైభవం తెస్తాడని రవితేజ నమ్మకంతో ఉన్నాడు. ఆల్‌రెడీ కొరటాల రవితేజకు ఓ స్టోరీ వినిపించాడని, అందుకు రవితేజ నుండి కూడా గ్రీన్‌సిగ్నల్‌ వచ్చిందని, ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించనున్నాడనేది తాజా సమాచారం. మరి పోటీలో ఉన్న ఎన్టీఆర్‌, అల్లుఅర్జున్‌, రవితేజలలో కొరటాల తన తదుపరి చిత్రాన్ని రవితేజతోనే చేస్తాడని విశ్వసనీయసమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ