Advertisementt

ఓకే బంగారం మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందా?

Mon 21st Sep 2015 07:01 AM
ok bangaram,komali,maniratnam,dulkar salman,nithya menon  ఓకే బంగారం మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందా?
ఓకే బంగారం మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందా?
Advertisement
Ads by CJ

చాలాకాలం తర్వాత ఓకే కన్మణి (తెలుగులో ఓకే బంగారం)తో క్రియేటివ్‌ జీనియస్‌ మణిరత్నం మరలా ట్రాక్‌లోకి వచ్చి సక్సెస్‌ రుచి చూశాడు. కాగా ఇప్పుడాయన ఓ మల్టీస్టారర్‌ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు, కార్తి, దుల్కర్‌సల్మాన్‌లు ఈ చిత్రంలో హీరోలుగా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో దుల్కర్‌సల్మాన్‌కు జోడీగా పలువురు హీరోయిన్లను పరిశీలించిన మణికి ఎవ్వరూ నచ్చకపోవడంతో ఓకే బంగారంలో దుల్కర్‌ సల్మాన్‌కు జోడీగా నటించి ఆన్‌ది స్క్రీన్‌ అద్బుతమైన కెమిస్ట్రీ పండించిన నిత్యామీనన్‌ వైపే మొగ్గుచూపాడట. ఈ పాత్ర చేయడానికి నిత్యా కూడా ఆనందంగా ఒప్పుకోవడంతో మరలా ఈజోడీ మరోసారి వెండితెరపై కనిపించనుంది. ఇక కార్తీకి జోడీగా త్రిషను పెట్టుకుంటే బాగుంటుందని భావిస్తున్నాడట మణిరత్నం. మరో వారం లోపు ఈ విషయంపై కూడా క్లారిటీ రానుంది. కాగా ఈ చిత్రానికి కోమలి అనే టైటిల్‌ను పెట్టే యోచనలో మణి ఉన్నాడని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ