Advertisementt

రామ్‌చరణ్‌ సాయం ఎవరికోసం...?

Mon 21st Sep 2015 04:59 AM
ram charan,courier boy kalya,nithin,gautham menon  రామ్‌చరణ్‌ సాయం ఎవరికోసం...?
రామ్‌చరణ్‌ సాయం ఎవరికోసం...?
Advertisement
Ads by CJ

నేటి యంగ్‌హీరోలు సినిమాల విషయంలో పోటీపడే రకమే తప్ప వీరందరూ వ్యక్తిగత జీవితంలో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఒకరు ఇబ్బందుల్లో ఉంటే మరోకరు సాయం చేస్తారు. తాజాగా దానికి ఉదాహరణ రామ్‌చరణ్‌ అనేది టాలీవుడ్‌ హాట్‌టాపిక్‌. నితిన్‌ నటించిన కొరియర్‌బోయ్‌ కళ్యాణ్‌ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మొదటిరోజే ఫ్లాప్‌టాక్‌ వచ్చింది. అయితే అసలు ఈ సినిమా విడుదల కావడమే గొప్ప అంటున్నారు ఫిల్మ్‌నగర్‌ వాసులు. చివరి క్షణాల్లో ఈ చిత్రానికి ఆర్థిక ఇబ్బందులు రావడంతో రామ్‌చరణ్‌ ఈ సినిమా విడుదల కావడానికి మాట సాయం చేశాడని సమాచారం. అయితే రామ్‌చరణ్‌ చేసిన సహాయం నితిన్‌ను చూశా? లేక తనతో ఎప్పటినుండో ఓ సినిమా చేయాలని ఆశపడుతున్న గౌతమ్‌మీనన్‌ను చూసా? అనే విషయంపై ఫిల్మ్‌నగర్‌లో ఆసక్తికరచర్చ జరుగుతోంది. వాస్తవానికి గౌతమ్‌మీనన్‌ రామ్‌చరణ్‌తో ఓ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ స్టోరీతో సినిమా తెరకెక్కించాలని ఆరాటపడుతున్న విషయం తెలిసిందే. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ