Advertisementt

అక్టోబర్‌లో 300కోట్లను టార్గెట్‌ చేసిన టాలీవుడ్‌..!

Mon 21st Sep 2015 03:55 AM
rudhramadevi,brucelee,akhil,kanche movie,shivam  అక్టోబర్‌లో 300కోట్లను టార్గెట్‌ చేసిన టాలీవుడ్‌..!
అక్టోబర్‌లో 300కోట్లను టార్గెట్‌ చేసిన టాలీవుడ్‌..!
Advertisement
Ads by CJ

సాధారణంగా టాలీవుడ్‌కు సంక్రాంతి, సమ్మర్‌లు అతి పెద్ద సీజన్లు. కానీ విచిత్రంగా ఈ ఏడాది అక్టోబర్‌ అంటే విజయదశమి సీజన్‌ ఏకంగా 300కోట్లను టార్గెట్‌ చేసింది. అక్టోబర్‌ 2న వరుణ్‌తేజ్‌ కంచె, రామ్‌ శివమ్‌, అనుష్క సైజ్‌జీరో చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. ఆ తర్వాత అక్టోబర్‌ 9న రుద్రమదేవి విడుదలకానుంది. రామ్‌చరణ్‌ నటించిన బ్రూస్‌లీ చిత్రం అక్టోబర్‌ 16న, అక్కినేని అఖిల్‌, అఖిల్‌ సినిమా అక్టోబర్‌ 21న విడుదలకు సిద్దమవుతున్నాయి. ఈ అన్ని చిత్రాల పెట్టుబడి లెక్కేసుకుంటే ఏకంగా 200కోట్లు దాటుతోంది. అయితే ఈ సినిమాల బిజినెస్‌ మాత్రం ఏకంగా 300కోట్లు దాటడం ఖాయమని ట్రేడ్‌వర్గాలు అంచనా వేస్తున్నాయి. బాహుబలి, శ్రీమంతుడు ఇచ్చిన బూస్టప్‌తో ఈ రాబోయే చిత్రాలు భారీ వసూళ్లను వసూలు చేసి 300కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ