ఈరోజుల్లో, బస్ స్టాప్ వంటి చిత్రాలను తెరకెక్కించి హిట్ కొట్టినా డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా సినిమాలు చేయలేడని ముద్ర పడిన దర్శకుడు మారుతి. కాని ప్రేమ కథా చిత్రం వంటి హారర్ చిత్రాన్ని తీసి తన ఇమేజ్ ను పెంచుకున్నాడు. రీసెంట్ గా తను డైరెక్ట్ చేసిన భలే భలే మగాడివోయ్ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సినిమాతో మారుతి అన్ని రకాల జోనర్స్ సినిమాలు చేయగలడని ప్రూవ్ చేసుకున్నాడు. అయితే తను ఒక జోనర్ కు మాత్రమే పరిమితమయ్యి సినిమాలు చేయనని, అన్ని రకాల చిత్రాలను తీయాలనుందని మారుతి చెబుతున్నారు. అంతేకాకుండా స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాడట. పవన్ కళ్యాన్, మహేష్ బాబు లాంటి హీరోలకు సరిపడే స్క్రిప్ట్ లు తన దగ్గరున్నాయని చెప్పుకొచ్చారు. మరి మారుతి కల ఎంత వరకు నెరవేరుతుందో చూడాలి..!