Advertisementt

మంచు కాంపౌండ్‌కే ఫిక్స‌య్యావా డైరెక్ట‌రూ?

Sun 20th Sep 2015 04:04 AM
nageshwara reddy,denikaina ready,vishnu,kannappa  మంచు కాంపౌండ్‌కే ఫిక్స‌య్యావా డైరెక్ట‌రూ?
మంచు కాంపౌండ్‌కే ఫిక్స‌య్యావా డైరెక్ట‌రూ?
Advertisement
Ads by CJ

కామెడీని బాగా డీల్ చేస్తాడ‌ని పేరు తెచ్చుకొన్న ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర‌రెడ్డి. 6టీన్స్ మొద‌లుకొని సీమ‌శాస్త్రి, సీమ‌ట‌పాకాయ్‌లాంటి చిత్రాల‌తో మంచి  స‌క్సెస్‌లు అందుకొన్నాడు. అయితే నాగేశ్వ‌ర‌రెడ్డి పేరు  మార్మోగిపోయేలా చేసింది మాత్రం దేనికైనా రెడీ సినిమానే. ఒక‌ర‌కంగా మంచు కాంపౌండ్‌లోకి వ‌చ్చాకే ఆయ‌నకి క‌మ‌ర్షియ‌ల్ ద‌ర్శ‌కుడిగా గుర్తింపొచ్చింద‌ని చెప్పొచ్చు. దేనికైనా రెడీ సూప‌ర్‌స‌క్సెస్ కావ‌డం, అదే స‌మ‌యంలో ఆ సినిమాని వివాదాలు చుట్టుముట్ట‌డంతో చిత్ర ద‌ర్శ‌కుడిగా నాగేశ్వ‌ర‌రెడ్డి ఇటు ఇండ‌స్ట్రీని, అటు ప్రేక్ష‌కుల్నీ ప్ర‌ముఖంగా ఆక‌ర్షించాడు. ఆ దెబ్బ‌తో ఆయ‌న స్టార్ హీరోల్ని డైరెక్ట్ చేసే అవ‌కాశం కొట్ట‌డం ఖాయం అనుకొన్నారంతా. నాగేశ్వ‌ర‌రెడ్డి కూడా ర‌వితేజ‌లాంటి హీరోల్ని ప‌ట్టే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు. దీంతో మ‌ళ్లీ మంచు కుటుంబంలోని హీరోనే ప‌ట్టేసి మ‌నోజ్‌తో క‌రెంటుతీగ‌ తీశాడు. ఆ సినిమాతో ద‌ర్శ‌కుడిగా  నాగేశ్వ‌ర‌రెడ్డి మంచి మార్కులే సంపాదించుకొన్నాడు. ఎందుకో తెలీదు కానీ...  ఆ త‌ర్వాత కూడా  స్టార్ హీరోలెవ్వ‌రూ ఆయ‌న‌తో సినిమాలు తీసేందుకు రాలేదు. దీంతో సుశాంత్‌తో ఓ సినిమా  చేయాల‌ని ప్లాన్ చేసుకొన్నాడు. అది రేపోమాపో కొబ్బ‌రికాయ కొట్టేస్తార‌నుకొనేలోపు మ‌రో ట్విస్టు. 

నాగేశ్వ‌ర‌రెడ్డి మళ్లీ మంచు హీరోతోనే సినిమా చేయ‌డానికి రెడీ అయిపోయాడు. దేనికైనా రెడీ కాంబినేష‌న్‌లోనే త‌దుప‌రి చిత్రం తెర‌కెక్క‌బోతోంది. అనిల్ సుంక‌ర ఆ చిత్రాన్ని నిర్మిస్తారు. నిన్న‌నే ఆ విష‌యాన్ని స్వ‌యంగా ప్ర‌క‌టించాడు మంచు విష్ణు. సొంత ప్రొడ‌క్ష‌న్‌లో  క‌న్న‌ప్ప‌ లాంటి సినిమాని భారీగా తీయాల‌ని అనుకొన్నాడు విష్ణు. అయితే ప‌లువురు ద‌ర్శ‌కులు ఇంట్ర‌స్టింగ్ క‌మ‌ర్షియ‌ల్ స్క్రిప్టులు తీసుకొస్తుండ‌టంతో త‌న ప్ర‌య‌త్నాల‌న్నీ పక్క‌న‌పెట్టి వేరే నిర్మాణం సంస్థ‌ల్లో సినిమాలు చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు విష్ణు. దేనికైనా రెడీ లాగే ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని బేస్ చేసుకొని ఈ సినిమాని తెర‌కెక్కించేందుకు నాగేశ్వ‌ర‌రెడ్డి స్క్రిప్టు సిద్ధం చేసుకొన్న‌ట్టు తెలుస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ