Advertisementt

రజనీనా? మజాకా...?

Sat 19th Sep 2015 06:04 AM
kabali movie,rajinikanth,ranjith,radhika apte  రజనీనా? మజాకా...?
రజనీనా? మజాకా...?
Advertisement
Ads by CJ

కొచ్చాడయాన్‌, లింగా చిత్రాలతో అభిమానులనే కాదు... నిర్మాతలను, బయ్యర్లను కూడా తీవ్రంగా నిరాశపరిచిన సౌత్‌ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తన తదుపరి చిత్రానికి ఎనిమిది నెలల గ్యాప్‌ తీసుకొని రంజిత్‌ అనే కుర్రడైరెక్టర్‌ను ఎంచుకోవడంతో ఆయన అభిమానులతో పాటు కోలీవుడ్‌ పరిశ్రమ కూడా ఈ కబాలి చిత్రాన్ని లైట్‌ తీసుకున్నాయి. ఈ చిత్రం ఓపెనింగ్‌ వినాయకచవితికి ప్రారంభమైన సందర్బంగా విడుదల చేసిన ఈ కబాలి ఫస్ట్‌లుక్స్‌ చూసి రజనీ అభిమానులు కానివారు కూడా వావ్‌.. అంటున్నారు. 65ఏళ్ల వయసు ఉన్న రజనీని ఈ పోస్టర్స్‌లో చూస్తే ఆయన స్టైల్‌ చూసిన వారు 25ఏళ్ల వయసులో ఎలాంటి స్టైల్‌ను చూపించాడో ఈ వయసులోనూ ఆయన అదే స్టైల్‌ని చూపించాడని అంటున్నారు. చూడటానికి తెల్లగడ్డం, నెరిసిన జుట్టుతో ఉన్నప్పటికీ ఆయన స్టైల్‌ మాత్రం అత్యద్భుతం అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. రాధికాఆప్టే ఓ కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో కబలేశ్వరన్‌ అనే ఓ మాఫియా డాన్‌ పాత్ర రజనీ పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కేవలం మూడునెలల్లోనే పూర్తిచేయాలని రజనీ సంకల్పం. ఈ చిత్రానికి సంబంధించిన 220 పేజీల బౌండెడ్‌ స్క్రిప్ట్‌ను రజనీ కేవలం ఒకే రోజులో చదివి, ఆ పక్క రోజే ఈ చిత్రం గురించిన కొన్ని అంశాల గురించి డైరెక్టర్‌ రంజిత్‌తో చర్చించాడట. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్‌ రంజిత్‌ తెలిపాడు. వాస్తవానికి అంతటి స్క్రిప్ట్‌ను పూర్తిగా క్షుణ్ణంగా చదవి అర్దం చేసుకోవడానికి కనీసం ఓ వారం పడుతుందని రంజిత్‌ భావించాడట. కానీ ఒకే ఒక్క రోజులో ఈ స్క్రిప్ట్‌ను చదివి మార్పులు చేర్పులు చెప్పడం చూసి, 65ఏళ్ల వయసులో కూడా అంత ధారణశక్తి, జ్ఞాపకశక్తిని చూసి తాను ఆశ్చర్యపడిపోయానని రంజిత్‌ మీడియాకు తెలిపాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ