మెగాస్టార్ చిరంజీవి మరలా ఫుల్‌ప్లెడ్జ్‌డ్ హీరోగా నటించే తన 150వ చిత్రం విషయంలో ఇప్పటికీ ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాడు. పూరీ చెప్పిన స్టోరీ ఓకే అన్నప్పటికీ సెకండాఫ్ అతనికి నచ్చకపోవడంతో ఆటోజానీ కి క్యాన్సిల్ చేశాడు. ఈలోపు తన తనయుడు రామ్‌చరణ్ నటిస్తున్న తాజా చిత్రం బ్రూస్‌లీ లో ఓ కీలకపాత్రను చేయడానికి ఓకే చెప్పాడు. అయితే చిరు ఎట్టకేలకు తన 150వ చిత్రంగా ఓ రీమేక్‌నే ఓకే చేశాడని సమాచారం. తనకు సరిగ్గా నప్పే కథ కావడంతో తమిళంలో విజయ్-మురుగదాస్‌ల కాంబినేషన్‌లో వచ్చి సంచలన విజయం సాదించిన కత్తి సినిమా అయితేనే తనకు సరిగ్గా సూట్ అవుతుందని చిరు బావించాడట. ఈ చిత్రంలో ఎంటర్‌టైన్‌మెంట్ పాళ్లు తక్కువగా ఉండటంతో ఈ కత్తి స్టోరీకి మార్పులు చేర్పులు చేసి మన తెలుగు ఆడియన్స్ టేస్ట్‌కు అనుగుణంగా మార్పులు చేయమని, అలాగే కామెడీ డోస్ పెంచాల్సిందిగా పరుచూరి బ్రదర్స్‌ను పురమాయించినట్లు సమాచారం. ఈ మార్పులు చేర్పులు పూర్తయిన తర్వాత చిరు ఫైనల్ డెసిషన్ తీసుకోనున్నాడు.