Advertisementt

ఒకే చిత్రం..మూడో టైటిల్‌!

Thu 17th Sep 2015 02:34 PM
vennello hai hai,vennello hai hai movie,vamsi,tanu monne vellipoyindi,mellaga tattindi manasu talupu,vamsi movie  ఒకే చిత్రం..మూడో టైటిల్‌!
ఒకే చిత్రం..మూడో టైటిల్‌!
Advertisement
Ads by CJ

ఒక్క సినిమాకు ఒకే పేరు ఉంటుంది. ఎన్ని పేర్లు తెరపైకి వచ్చినా చివరకు ఒకే టైటిల్‌ను కన్‌ఫర్మ్‌ చేస్తారు. చివరి క్షణాల్లో టైటిల్‌ను మార్చడం టాలీవుడ్‌లో అరుదైన విషయంగానే చెప్పాలి. కానీ సీనియర్‌ డైరెక్టర్‌ వంశీ మాత్రం తన 25వ చిత్రానికి టైటిల్స్‌ మారుస్తూనే ఉన్నాడు. అజ్మల్‌ హీరోగా రూపొందుతున్న చిత్రానికి మొదట తను మొన్నే వెళ్లిపోయింది అని పెట్టాడు. కానీ ఆ తర్వాత పాత పేరును మార్చి మెల్లగా తట్టింది మనసు తలుపు అంటూ మార్చాడు. అయినా సినిమా జాతకం మాత్రం మారలేదు. ఈ చిత్రం విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. ఈ టైటిల్‌ గుర్తుపెట్టుకోవడానికే కాదు... కనీసం పలకడానికి కూడా కష్టమైంది. తాజాగా వంశీ ఈ టైటిల్‌ను కూడా మార్చివేసి వెన్నెల్లో హాయ్‌ హాయ్‌ అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్‌ చేశాడు. మొత్తానికి మిగతా టైటిల్స్‌ కంటే ఈ తాజా టైటిలే ఆట్టుకునేలా ఉండటంతో పాటు మంచి హిట్టయిన పాటలోనిది కాబట్టి ఓకే అనవచ్చు. త్వరలో ఈ చిత్రాన్ని రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ