Advertisementt

పవన్‌పై నితిన్‌...అభిమానం అలాంటిది!

Thu 17th Sep 2015 01:14 PM
pawan kalyan,nithiin,courier boy kalyan,akhil,nithiin movies,a aa movie,trivikram srinivas  పవన్‌పై నితిన్‌...అభిమానం అలాంటిది!
పవన్‌పై నితిన్‌...అభిమానం అలాంటిది!
Advertisement
Ads by CJ

యంగ్‌హీరో నితిన్‌ పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌కు వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. కాగా నితిన్‌ నిర్మాతగా అక్కినేని అఖిల్‌ డెమ్యూమూవీ అఖిల్‌ ను ఆయనే నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆడియో వేడుకకు నితిన్‌ పవన్‌కళ్యాణ్‌ను తీసుకొని వస్తాడనే ప్రచారం సాగుతోంది. ఈ విషయమై హీరో నితిన్‌ మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ 20న ఆడియో వేడుక గ్రాండ్‌గా జరిపేందుకు ప్లాన్‌ చేస్తున్నాం. ప్రస్తుతం గెస్ట్‌ల లిస్ట్‌ను తయారు చేస్తున్నాం.. అని తెలిపాడు. త్వరలో నితిన్‌ నిర్మాతగా పవన్‌కళ్యాణ్‌తో ఓ చిత్రం నిర్మించనున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై నితిన్‌ స్పందిస్తూ..పవన్‌కళ్యాణ్‌ గారితో పని చేసే అవకాశం వస్తే.. ఎంత ఖర్చయినా దక్కించుకుంటాను. నా సినిమాలు అన్నీ స్టాప్‌ చేసి ఆ సినిమాను నిర్మిస్తాను... అంటూ వెల్లడించాడు. కాగా నితిన్‌ నిర్మాతగా మారిన నేపథ్యంలో ఆ అనుభవం ఎలా ఉంది? అని అడిగితే .. అమ్మ బాబోయ్‌.. అంటున్నాడట. ఇలా మొదటి సినిమాకే నిర్మాతల కష్టాలు నితిన్‌కు తెలిసొచ్చాయని అంటున్నారు. పాపం.. ఇంతకు ముందే కళ్యాణ్‌రామ్‌, అల్లరినరేష్‌లు నిర్మాతలుగా మారి ఒకే దెబ్బకు భయపడిపోయారు. ఇక నితిన్‌ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశాడు. సినిమా థియేటర్లలో టిక్కెట్ల రేట్లు కాఫీ రేట్లు కంటే తక్కువగా ఉన్నాయని, రేట్లు పెంచడం తప్పుకాదని ఆయన చేసిన వ్యాఖ్యలపై కొందరు మండిపడుతున్నారు. ఓ నిర్మాతగా మాత్రమే ఆలోచించి ఆయన ఇలా మాట్లాడాడని, హీరోగా అయితే అలాంటి స్టేట్‌మెంట్‌ చేసేవాడే కాదని.. ఆయన సన్నిహితులు సైతం అంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ