Advertisementt

మళ్ళీ దేవిశ్రీ నే టాప్!

Thu 17th Sep 2015 12:01 PM
devisri prasa,puli,kumar 21f,sardaar gabbar singh,top movies in devisri hands,thaman,bruce lee,akhil  మళ్ళీ దేవిశ్రీ నే టాప్!
మళ్ళీ దేవిశ్రీ నే టాప్!
Advertisement
Ads by CJ

మొదటి నుండి దేవిశ్రీప్రసాద్‌ది డిఫరెంట్‌ స్టైల్‌. అయితే కొంతకాలం కిందట ఆయనకు తమన్‌ నుండి గట్టిపోటీ ఎదురైంది. అయినా కూడా దేవిశ్రీ.. తమన్‌ కంటే జోరుగా ముందుకు సాగుతున్నాడు. ఒకవిధంగా చెప్పాలంటే టాలీవుడ్‌ నెంబర్‌వన్‌ స్ధానం ప్రస్తుతం దేవిశ్రీదే అని చెప్పవచ్చు. సన్నాఫ్‌ సత్యమూర్తి, శ్రీమంతుడు వంటి విజయాలతో పాటు ఆయన సంగీతం అందించిన శివమ్‌ చిత్రం ఆల్బమ్‌ కూడా శ్రోతలను అలరిస్తోంది. తెలుగులోనే గాక తమిళంలో విజయ్‌ హీరోగా రూపొందుతున్న పులి వంటి భారీ చిత్రానికి కూడా దేవిశ్రీనే సంగీతం అందిస్తున్నాడు. ఇక కుమారి 21ఎఫ్‌ తో పాటు సుకుమార్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా చేస్తున్న నాన్నకు ప్రేమతో, పవన్‌కళ్యాణ్‌ సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ వంటి భారీ చిత్రాలు దేవిశ్రీ చేతిలోనే ఉన్నాయి. కానీ తమన్‌కు మాత్రం రేసుగుర్రం తర్వాత చెప్పుకోదగిన సినిమా పడకపోవడంతో రేసులో వెనక్కి వెళ్లాడు.  ప్రస్తుతం తమన్‌ సంగీతం అందిస్తున్న రామ్‌చరణ్‌ బ్రూస్‌లీ, అక్కినేని అఖిల్‌ డెమ్యూ మూవీ అఖిల్‌ కు సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాలు విడుదలైన తర్వాతే తమన్‌ స్ధానం ఏమిటి? అనేది డిసైడ్‌ కానుందని, ఈ రెండు చిత్రాలు తమన్‌కు అగ్నిపరీక్షగా మారాయని చెప్పకతప్పదు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ