సంగీత దర్శకునిగానే కాదు.. మంచి డాన్సర్‌గా, యువతకు నచ్చే మంచి పాటల రచయితగా కూడా దేవిశ్రీప్రసాద్‌కు మంచి గుర్తింపు ఉంది. కాగా ఆయన ప్రస్తుతం సుకుమార్ సమర్పణలో రూపొందుతున్న కుమారి21 ఎఫ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఓ వైపు స్టార్‌హీరోల చిత్రాలకే సంగీతం అందించడానికి సమయం లేక ఇబ్బందులు పడుతున్న దేవిశ్రీప్రసాద్ రాజ్‌తరుణ్ వంటి చిన్న హీరో చిత్రానికి సంగీతం అందిస్తున్నాడంటే అది రాజ్‌తరుణ్ అదృష్టమనే చెప్పాలి. అయితే సుకుమార్ మీద ఉన్న గౌరవంతో ఆయన ఈ చిత్రానికి సంగీతం అందించడానికి ఒప్పుకున్నాడనేది జగమెరిగిన సత్యం. తాజాగా దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రంలోని ఓ పాటకు కొరియోగ్రాఫర్‌గా కూడా పనిచేశాడట. ఈ పాటను విదేశాల్లో చిత్రీకరించారని సమాచారం. మరి కొరియోగ్రాఫర్ అవతారంలో దేవిశ్రీ ఎంతగా సక్సెస్ అవుతాడో వేచిచూడాల్సివుంది..!