Advertisementt

బ్రూస్‌లీలో మరో అట్రాక్షన్‌..!

Wed 16th Sep 2015 05:31 AM
brucelee movie,ram charan,tisco chopra,sreenuvaitla  బ్రూస్‌లీలో మరో అట్రాక్షన్‌..!
బ్రూస్‌లీలో మరో అట్రాక్షన్‌..!
Advertisement
Ads by CJ

రామ్‌చరణ్‌ హీరోగా డివివి దానయ్య నిర్మాణంలో శ్రీనువైట్ల దర్శకుడిగా రూపొందుతున్న చిత్రం బ్రూస్‌లీ. ఇందులో రకుల్‌ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా కృతికర్బంద రామ్‌చరణ్‌కు సోదరిగా నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్రలో మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో మరో అట్రాక్షన్‌ కూడా ఎంటర్‌ అయింది. బాలీవుడ్‌ నటి టిస్కో చోప్రా ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో నటిస్తోంది. ఆమె పాత్ర కథకు చాలాకీలకంగా ఉంటుందని తెలుస్తోంది. కాగా బ్రూస్‌లీ కథ లీకైందంటూ వార్తలు వస్తున్నాయి. లీకైన వార్తల ప్రకారం ఇందులో రామ్‌చరణ్‌ ఓ స్టంట్‌ మాస్టర్‌గా నటించనున్నాడు. నిజానికి అతను సీక్రెట్‌ పోలీస్‌. ఆయన సోదరిని కొందరు గూండాలు హత్య చేస్తారు. ఈ విషయంలో ఎంక్వైరీ చేస్తే ఈ హత్య వెనుక ఓ పెద్ద డాన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. మరి రామ్‌చరణ్‌ అంచెలంచెలుగా ఆ డాన్‌ని ఎలా తుదముట్టిస్తాడు? అనే యాక్షన్‌ పాయింట్‌ను శ్రీనువైట్ల తనదైన ఎంటర్‌టైన్‌మెంట్‌తో చూపించబోతున్నాడట...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ