టాలీవుడ్‌ని వదిలేసి బాలీవుడ్‌కు వెళ్లినా, టాలీవుడ్ సినిమాలు కాదని కోలీవుడ్ జపం చేసినా కూడా మిల్కీబ్యూటీ తమన్నాకు టాలీవుడ్‌లో వచ్చినన్ని పెద్దపెద్ద చాన్స్‌లు ఆమెకు ఇతర భాషల్లో రాలేదనే చెప్పాలి. రామ్‌చరణ్‌తో రచ్చ మినహా ఆమె స్టార్‌హీరోలతో చేసిన చిత్రాలన్నీ ఫ్లాప్ అయ్యాయి.అయినా చివరకు ఆమెకు టాలీవుడ్డే దిక్కైంది. రాజమౌళి ఆమెను బాహుబలిలోకి తీసుకోవడంతో ఈ సినిమా పుణ్యమా అని ఆమెకు దేశవిదేశాల్లో కూడా ఎంతో గుర్తింపు వచ్చింది. కానీ ఇంత జరిగినా కూడా తమన్నాకు టాలీవుడ్ హీరోలంటే చిన్నచూపు పోలేదు. ఆమెను మీకు ఇష్టమైన హీరోల పేర్లు చెప్పమంటే.. బాలీవుడ్ హీరోలతో పాటు కోలీవుడ్ హీరోలైన ఆర్య, కార్తీ వంటివారి పేర్లను చెప్పిందే కానీ ఒక్క టాలీవుడ్ హీరో పేరు కూడా ఆమె చెప్పకపోవడం ఆమె నైజాన్ని తెలియజేస్తోంది. పొరుగింటి పుల్లకూర రుచి అనే సామెత తమన్నాకు సరిగ్గా సరిపోతుందని అంటున్నారు టాలీవుడ్ విశ్లేషకులు.