రాజకీయాలు, ఫ్యామిలీలోనే కాదు.. సినిమాలలో కూడా నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ ఒంటరైపోతున్నాడు. ఇప్పటివరకు టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ 50కోట్ల క్లబ్‌లో చేరి, ప్రస్తుతం 100కోట్ల క్లబ్‌పై కన్నేశారు. కానీ జూనియర్ మాత్రం ఇప్పటికీ 50కోట్ల క్లబ్బులో స్థానం సంపాదించలేకపోయాడు. బాద్‌షా, టెంపర్ చిత్రాలు బాగానే ఉన్నప్పటికీ అవి కాస్ట్ ఫెయిల్యూర్స్‌గా నిలిచి 50కోట్ల క్లబ్బులో చోటు సంపాదించుకోలేకపోతున్నాయి. వాస్తవానికి బృందావనం తర్వాత ఎన్టీఆర్‌కు ఒక్క సినిమా కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో విజయం సంపాదించిపెట్టలేదు. ఇక సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంపైనే ఎన్టీఆర్ ఆశలన్నీ ఉన్నాయి. ఈ చిత్రంతో 50కోట్లను పక్కనపెట్టి ఒకేసారి 100కోట్ల క్లబ్బులో స్థానం సంపాదించాలనే పట్టుదలతో ఎన్టీఆర్ ఉన్నాడు. మరి ఈ చిత్రమైనా ఎన్టీఆర్‌కు ఒకే ఒక్క బ్లాక్‌బస్టర్‌ని అందిస్తుందో లేదో వేచిచూడాలి...! ప్రస్తుతం ఎన్టీఆర్ పరిస్థితి రవితేజకు సమానంగా ఉందని ట్రేడ్‌వర్గాలు అంటున్నాయి.