Advertisementt

నితిన్‌ 20కోట్లకు కొన్నాడట..!

Tue 15th Sep 2015 06:08 AM
nithin,surya,vikram kumar,24 movie,rakshasudu  నితిన్‌ 20కోట్లకు కొన్నాడట..!
నితిన్‌ 20కోట్లకు కొన్నాడట..!
Advertisement
Ads by CJ

తనకు ఇష్క్‌ వంటి సూపర్‌హిట్‌ను ఇచ్చిన దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌పై హీరో నితిన్‌కు చాలా నమ్మకం. అందుకే ఆయన పోటీపడి మరీ.... విక్రమ్‌కుమార్‌-సూర్యల కాంబినేషన్‌లో రూపొందుతున్న 24 సినిమా తెలుగు హక్కులను సొంతం చేసుకున్నాడు. ఇందుకోసం ఆయన 20కోట్లు ఖర్చుపెట్టినట్లు తమిళ ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ మొత్తం వెచ్చించినట్లు చెబుతున్నారు. సూర్య నటించిన సికిందర్‌, రాక్షసుడు చిత్రాలు డిజాస్టర్స్‌గా నిలిచినప్పటికీ డైరెక్టర్‌ విక్రమ్‌ కుమార్‌ మీద ఉన్న నమ్మకమే నితిన్‌ ఈ సినిమాను కొనుగోలు చేయడానికి కారణంగా తెలుస్తోంది. తమిళ, తెలుగు భాషల్లో కలిపి మొత్తం థియేటర్‌ బిజినెస్‌ 70కోట్ల దాకా చేశారని టాక్‌. ఇక తెలుగులో ఓ డబ్బింగ్‌ సినిమాపై 20కోట్లు పెట్టడం చాలా పెద్ద మొత్తం అంటున్నారు. అయితే హీరో సూర్యకు ఇక్కడ ఉన్న మార్కెట్‌, విక్రమ్‌ కుమార్‌కు ట్రేడ్‌వర్గాల్లో ఉన్న క్రేజ్‌తో బిజినెస్‌ బాగా జరుగుతుందని భావించే నితిన్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ