పాతికేళ్ల కిందట నాగార్జున-రామ్‌గోపాల్‌వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ శివ ఎంతగా హిస్టరీ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అప్పట్లో ఓ ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన ఈ సూపర్‌హిట్ మూవీతో నాగార్జున ఇమేజ్ ఓ రేంజ్‌కు చేరుకుంది. గతేడాదితో 25ఏళ్లు పూర్తి చేసుకున్న శివ సినిమాను రీ రిలీజ్ చేయాలని భావించాడు నాగార్జున. అయితే అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌ను నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాడట. శివ సీక్వెల్ అంటే ఆడియెన్స్‌లో క్రేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ ఖర్చుతో సినిమాను రూపొందించి భారీగా క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నాడు నాగ్. ఇప్పటికే సీక్వెల్‌కు స్టోరీ రెడీ చేయమని వర్మను కోరిన నాగ్ అందులో తనతో పాటు అమల, పెద్దకొడుకు నాగచైతన్య, చిన్నకొడుకు అఖిల్‌లను కూడా యాక్ట్ చేసేలా ప్లాన్ చేయాలని వర్మకు సూచించాడట. దీంతో శివ సీక్వెల్‌తో మరోసారి అక్కనేని ఫ్యామిలీ మనం ప్రయోగాన్ని రిపీట్ చేయయబోతోందని ఇండస్ట్రీ టాక్. అయితే శివ సినిమాకు సీక్వెల్ చేయడం అంత ఈజీ కాదు. వర్మ నిజంగానే సీక్వెల్ స్టోరీ రెడీ చేస్తే మాత్రం అది నిజంగా ఓ సంచలనమే అవుతుందని కొందరు చర్చించుకుంటున్నారు.