Advertisementt

కొరియర్ బోయ్ కళ్యాణ్ డౌటే!

Sat 12th Sep 2015 04:49 AM
courier boy kalyan,nithin,prem sai,gautham menon  కొరియర్ బోయ్ కళ్యాణ్ డౌటే!
కొరియర్ బోయ్ కళ్యాణ్ డౌటే!
Advertisement
Ads by CJ

నితిన్ నటించిన కొరియర్ బోయ్ కళ్యాణ్ ఎట్టకేలకు సెన్సార్ పూర్తి చేసుకుంది. ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. అయితే మూడు సంవత్సరాలుగా ఈ చిత్రం విడుదల కోసం ఎదురుచూసిన ఈ చిత్ర యూనిట్ కు సెన్సార్ సభ్యుల నుండి అనుకున్న రెస్పాన్స్ రాలేదని తెలుస్తుంది. అలాగే సినిమా బిజినెస్ కూడా అనుకున్న స్థాయిలో జరగలేదు. నితిన్ ఈ సినిమాపై అంటి అంటనట్లుగా ఉండడమే దీనికి కారణమనుకోవచ్చు. ఇప్పటికే రెండు మూడు సార్లు పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా ఎట్టకేలకు సెప్టెంబర్ 17 న రిలీజ్ అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. అయితే అప్పుడు కూడా రిలీజ్ అవుతుందో లేదో చెప్పలేము. వీటన్నింటికి ఆర్ధిక కారణాలే కారణమంటున్నారు. గౌతం మీనన్ శిష్యుడు ప్రేమ్ సాయి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ