భలేభలేమగాడివోయ్ సినిమా సూపర్‌హిట్ కొట్టిన తర్వాత మారుతికి ఉన్న ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆయన డైరెక్షన్‌లో నటించడానికి యంగ్ హీరోలు ఉవ్విళ్లూరుతున్నారు. కానీ ఆయన మనసు మాత్రం విక్టరీ వెంకటేష్ మీదనే ఉంది. వీరిద్దరి కలయికతో రూపొందాల్సిన రాధ చిత్రం కొన్ని అనివార్యకారణాల వల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే. దాంతో బాగా ఫీలయిన మారుతి వెంకీ కోసం మరో కొత్త కథ రాసుకొని వెంకీకి వినిపించే ప్రయత్నాల్లో ఉన్నాడు. కాగా వెంకీతో సినిమా మొదలుపెట్టే ముందే ఆయన మరో చిన్న సినిమా చేయాలనే ప్లాన్‌తో ఉన్నాడు. మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడిని హీరోగా పరిచయం చేసే చిత్రానికి మారుతి సిద్దమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరి మద్యలో నాగచైతన్యతో కూడా ఓ సినిమా చేస్తానని మారుతి తన సన్నిహితులకు చెబుతున్నట్లు సమాచారం.