మెగాస్టార్ చిరంజీవి తన సినీ జీవితంలో ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్లు చేశాడు. అయితే ప్రతి నటుడి జీవితంలో కొన్ని కొన్ని రకాల పాత్రలు చేయలేకపోయామనే వెలితి ఉన్నట్లే చిరు నటజీవితంలో కూడా అలాంటి వెలితి ఉందిట. ఆయన మాట్లాడుతూ... నా కెరీర్‌లో ఎన్నోరకాల పాత్రల్లో కనిపించినా భగత్‌సింగ్ గా కనిపించాలన్న కోరిక నెరవేరలేదు. అందుకే ఏదో రోజు నేను దేశభక్తుని పాత్రలో నటించాలనుకుంటున్నాను. అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలాంటిది ఖచ్చితంగా చేస్తాను.. అయితే అది 151వ చిత్రమా? లేక మరో చిత్రమా? అనేది మాత్రం చెప్పలేను.. అంటూ తన మనసులోని మాటను వెలిబుచ్చాడు. నిజంగా చిరంజీవి అలాంటి పాత్రల్లో నటిస్తే అంతకు మించిన ఆనందం మెగాఅభిమానులకు ఏముంటుంది....?