బాలీవుడ్ స్టార్, కండల వీరుడైన సల్మాన్‌ఖాన్ ప్రస్తుతం రెండు దక్షిణాది చిత్రాలపై కన్నేసినట్లు సమాచారం. ఆయన ఫ్లాప్‌ల్లో ఉన్నప్పుడు మహేష్‌బాబు పోకిరి చిత్రాన్ని బాలీవుడ్‌లో వాంటెడ్ గా రీమేక్ చేసి ఫ్లాప్‌ల్లోంచి బయటపడ్డాడు. కాగా ఆయన తాజాగా మహేష్‌బాబు నటించగా తెలుగులో ఘనవిజయం సాధించిన శ్రీమంతుడు చిత్రాన్ని బాలీవుడ్‌లో తానే నిర్మాతగా, హీరోగా సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు ఇటీవల తమిళంలో సంచలన విజయాన్ని నమోదు చేసిన జయం రవి చిత్రం తని ఒరువన్ చిత్రాన్ని కూడా ఆయన ప్రత్యేకంగా స్క్రీనింగ్ ఏర్పాటు చేసుకొని చూసి, ఆ సినిమాను తానే చేయాలని డిసైడ్ అయ్యాడని బాలీవుడ్ టాక్. మరి ఈ రెండు చిత్రాలు కనుక సల్మాన్ హీరోగా తెరకెక్కితే ఈ రెండు హిందీలో ఘనవిజయం సాధించడం ఖాయమని బాలీవుడ్ ట్రేడ్‌వర్గాలు అంచనా వేస్తున్నాయి.