టాలీవుడ్‌లో చిరంజీవి తర్వాత కొత్త తరం స్టార్స్‌లో అల్లుఅర్జున్, రామ్‌చరణ్, ఎన్టీఆర్, రామ్ వంటి హీరోలు డ్యాన్స్‌ల పరంగా స్టెప్పులతో అందరినీ అలరించి మెప్పిస్తున్నారు. అయితే మెగాబిమానులు మాత్రం రామ్‌చరణే బెస్ట్ డ్యాన్సర్ అని వాదిస్తుంటారు. కాగా చిరంజీవి, రామ్‌చరణ్‌లలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు? అని ఇటీవల ఓ పత్రిక ఇంటర్వ్యూలో చిరంజీవిని ప్రశ్నించగా... ఆయన సమాధానం ఇస్తూ.... రామ్‌చరణ్ కంటే నేనే బెస్ట్ డ్యాన్సర్‌ను అని సమాధానం ఇచ్చాడు. ఇక తన తనయుడు రామ్‌చరణ్‌తో తనకున్న రిలేషన్‌షిప్ గురించి మాట్లాడుతూ... మేమిద్దం తండ్రీకొడుకుల్లా కాకుండా మంచి స్నేహితుల్లా ఉంటాం. రామ్‌చరణ్ చిన్నతనం నుండి ఎంతో మెచ్యూర్డ్. నేనేమైనా మిస్టేక్స్ చేస్తే వెంటనే సరిచేసేవాడని... కొన్ని విషయాల్లో నాకు సలహాలు కూడా ఇస్తుండే వాడని చిరు చెప్పుకొచ్చాడు.