ఏ ముహూర్తాన పవన్‌కళ్యాణ్ గబ్బర్‌సింగ్ పార్ట్ 2 చేస్తానని ఎనౌన్స్ చేశాడో ఆరోజు నుంచి ఈ సినిమా కథ ఎన్నో మలుపులు తిరగడం మొదలెట్టింది. మొదట సంపత్ నంది డైరెక్ట్ చేస్తాడనుకున్న ఈ సినిమాని ఇప్పుడు పవర్ డైరెక్టర్ బాబీ చేతికి వచ్చింది. సర్దార్ గబ్బర్‌సింగ్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పవన్ కళ్యాణే కథ, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. అయితే షూటింగ్ విషయానికి వచ్చేసరికి మొదటి షెడ్యూల్ పూనెలో స్టార్ట్ అయినప్పటికీ ఆ షెడ్యూల్‌లో పవన్‌కళ్యాణ్ ఎంటర్ అవ్వలేదు. పవన్ బర్త్‌డేకి ఫస్ట్‌లుక్ రిలీజ్ చేద్దామని బాబీ భావించినప్పటికీ దానికి పవన్ సహకారం లేకపోవడం వల్ల గబ్బర్‌సింగ్ చిత్రంలోని స్టిల్స్‌తోనే సర్దార్ గబ్బర్‌సింగ్ ఫస్ట్‌లుక్‌గా రిలీజ్ చేశారు. టీజర్‌ని కూడా గబ్బర్‌సింగ్ చిత్రంలోనిదే కట్ చేశారు. ఈ విషయాల్లో బాబీ ప్రమేయం లేకపోవడంతో అతను ఇరకాటంలో పడ్డాడు.
ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం షూటింగ్‌లో పాల్గొంటున్న పవన్‌కళ్యాణ్ ఈమధ్య ఒకరోజు బాబీకి ఒక షాక్ ఇచ్చాడు. ఉదయమే షూటింగ్‌కి వచ్చిన పవన్‌కి ఆరోజు చెయ్యబోయే సీన్‌కి సంబంధించిన డైలాగ్స్ నచ్చకపోవడం వల్ల సెట్ నుంచి వెళ్ళిపోయాడట. అయోమయంలో పడ్డ బాబీ జుట్టు పీక్కున్నాడట. టాలీవుడ్‌లో ప్రతి డైరెక్టర్ ద్వితీయ విఘ్నాన్ని ఎదుర్కొన్నవారే. అయితే అది సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని ఫలితాన్ని బట్టి వచ్చేది. కానీ, బాబీ విషయంలో షూటింగ్ మొదట్లోనే విఘ్నాలు ఎదురవ్వడం అతని బ్యాడ్ లక్ అని చెప్పాలి.