జయం రవి హీరోగా మోహనరాజా దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన తని ఒరువన్ చిత్రం పెద్ద హిట్ కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఏ భాషలోనైనా రీమేక్ చెయ్యడానికి అనుకూలంగా వుండే సబ్జెక్ట్ కావడంతో ఈ చిత్రాన్ని పలు భాషల్లో రీమేక్ చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, కన్నడ, మరాఠి, బెంగాలీ భాషల్లో రీమేక్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. హిందీలో సల్మాన్‌ఖాన్, కన్నడలో పునీత్ రాజ్‌కుమార్‌లు ఈ సినిమా చేసే అవకాశం వుంది. తెలుగులో మహేష్ ఈ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ, మహేష్ మాత్రం ససేమిరా అంటున్నాడట.
ఇప్పటివరకు మహేష్ చేసిన సినిమాల్లో ఒక్క రీమేక్ కూడా లేదు. తనకి రీమేక్‌లు చెయ్యడం ఇష్టం లేదని గతంలోనే చెప్పిన మహేష్ అదే మాట మీద నిలబడ్డాడు. విజయ్ హీరోగా నటించిన కత్తి తమిళ్‌లో ఎంతో పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తెలుగు రీమేక్‌లో మహేష్ నటిస్తాడని ఆమధ్య వార్తలు రావడం, దాన్ని మహేష్ ఖండించడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే తని ఒరువన్ తెలుగు రీమేక్‌లో మహేష్ నటించే అవకాశమే లేదన్నది క్లియర్‌గా తెలుస్తోంది. ఇప్పుడు రామ్‌చరణ్ ఆ సినిమా చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలుసుకోవాలంటే వెయిట్ చెయ్యాల్సిందే.