ఈమధ్య తెలుగు ప్రేక్షకుల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. వారు డిఫరెంట్ తరహా చిత్రాలను బాగా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా రోడ్‌సైడ్ యాక్షన్ థ్రిల్లర్‌లకు వారు మక్కువ చూపిస్తున్నారు. గతంలో వచ్చిన గమ్యంతో పాటు తమిళ అనువాదమైన జర్నీ కూడా అదే తరహా చిత్రమే. తాజాగా నాగచైతన్య హీరోగా గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటిస్తున్న సాహసం శ్వాసగా సాగిపో కూడా రోడ్‌సైడ్ థ్రిల్లరే అని సమాచారం. ఇక తమిళంలో విక్రమ్, సమంత జంటగా విజయ్‌మిల్టన్ దర్శకత్వంలో రూపొందుతున్న 10ఎంద్రాకులం చిత్రం కూడా ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్‌గానే రూపొందుతోంది. దీంతో చాలామంది యువ దర్శకులు ఈ తరహా చిత్రాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి రాబోయే ఈ రెండు చిత్రాలు విజయం సాధిస్తే.. ఇలాంటి మరికొన్ని చిత్రాలు రూపొందే అవకాశం ఉంది...!