Advertisementt

ఒక్క నిముషం కోసమేనా మెగా హడావిడి!

Wed 09th Sep 2015 05:00 AM
chiranjeevi 150th movie,ramcharan latest movie bruce lee,chiranjeevi in bruce lee,bruce lee director srinu vaitla  ఒక్క నిముషం కోసమేనా మెగా హడావిడి!
ఒక్క నిముషం కోసమేనా మెగా హడావిడి!
Advertisement
Ads by CJ

నిన్న మొన్నటి వరకు 150వ సినిమా గురించి మెగా ఫ్యాన్స్‌గానీ, మీడియాగానీ తెగ హడావిడి చేసింది. తన పుట్టినరోజున 150వ సినిమాకి సంబంధించిన న్యూస్‌ వస్తుందని ఎదురుచూసిన మెగా ఫ్యాన్స్‌కి నిరాశే ఎదురైంది. ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పెట్టేసి రామ్‌చరణ్‌ లేటెస్ట్‌ మూవీ బ్రూస్‌లీ గురించి డిస్కస్‌ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో చిరంజీవి ఒక గెస్ట్‌ రోల్‌ చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అది ఎలాంటి క్యారెక్టర్‌? చిరంజీవి ఎంత సేపు కనిపిస్తారు? అనేది తాజా డిస్కషన్‌. సినిమాలో 15 నిముషాలపాటు చిరంజీవి క్యారెక్టర్‌ వుంటుందని కొందరు అంటుంటే, మరికొందరు 15 నిముషాలు చాలా తక్కువ అవుతుందని దాన్ని 20 నిముషాలకు పెంచారని మరికొందరు అంటున్నారు. 

ఇక అసలు విషయానికి వస్తే రామ్‌చరణ్‌ కొత్త సినిమా బ్రూస్‌లీలో చిరంజీవి కనిపించేది కేవలం ఒక్క నిముషం మాత్రమే. అంటే మగధీరలో కనిపించిన దానికంటే చాలా తక్కువ. నిజం చెప్పాలంటే రామ్‌చరణ్‌ సినిమాలో చిరంజీవి కనిపిస్తే బాగుంటుందని తప్ప ఈ గెస్ట్‌ అప్పియరెన్స్‌కి ఎలాంటి ప్రాధాన్యత లేదు. అయితే ఈ విషయంలో ఓ పక్క మెగా ఫ్యాన్స్‌, మరో పక్క మీడియా తెగ హడావిడి చేసేసి ఎవరికి ఇష్టమొచ్చినట్టు వాళ్ళు ప్రచారం చెయ్యడం చూస్తుంటే మీకేమనిపిస్తోంది?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ