Advertisementt

అక్కినేని హీరోల సందడే సందడి..!

Wed 09th Sep 2015 12:58 AM
nagarjuna,akhil,nagachaitanya,kalyan krishna  అక్కినేని హీరోల సందడే సందడి..!
అక్కినేని హీరోల సందడే సందడి..!
Advertisement
Ads by CJ

అక్కినేని నాగార్జునకు డిసెంబర్‌ సీజన్‌ బాగా కలిసొస్తుంది. ఎప్పటినుండో ఆయన నటించిన చిత్రాలు డిసెంబర్‌లో విడుదలై ఘనవిజయం సాధించాయి. దాన్ని దృష్టిలో పెట్టుకున్న నాగ్‌ తాను ద్విపాత్రాభినయం చేస్తున్న సోగ్గాడే చిన్నినాయన చిత్రాన్ని డిసెంబర్‌లోనే విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాడు. అన్నపూర్ణ బేనర్‌లో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా కళ్యాణ్‌కృష్ణ అనే నూతన దర్శకుడు పరిచయం అవుతున్నాడు. ఇక నాగార్జున పెద్దకుమారుడు నాగచైతన్య హీరోగా గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సాహసం శ్వాసగా సాగిపో చిత్రం నవంబర్‌లో విడుదలకు సిద్దమవుతోంది. ఇక నాగ్‌ చిన్న కొడుకు, నయా అక్కినేని వంశ హీరో అఖిల్‌ నటిస్తున్న డెబ్యూ మూవీ అఖిల్‌ కూడా అక్టోబర్‌లో విడుదలకు సిద్దమవుతోంది. ఇలా రాబోయే మూడు నెలల్లో ముగ్గురు అక్కినేని హీరోల చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఈ విషయం అక్కినేని అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ