మావయ్యకు మేనల్లుడికి ఉన్న సెంటిమెంట్ విడదీయరానిది. ఈ సెంటిమెంట్ సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు కూడా ఉంది. దానికి మహేష్ ఏమీ అతీతుడు కాదు. మహేష్ బాలనటునిగా పరిచయమై నేడు సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. అదే కోవలో మహేష్ కుమారుడు గౌతమ్‌కృష్ణ కూడా 1(నేనొక్కడినే) చిత్రంలో బాలనటుడిగా కనిపించాడు. ఇప్పుడు భలే భలే మగాడివోయ్‌తో మహేష్ మేనల్లుడు చరిత్ బాలనటునిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో హీరో నాని చిన్నప్పటి క్యారెక్టర్‌లో నటించింది హీరో సుధీర్‌బాబు కుమారుడు చరిత్. సో... బాలనటునిగా చేస్తే హీరోగా ఎదిగిపోవచ్చని కృష్ణ అభిమానులు ఆశపడుతున్నారు. కాగా ఇందులో తన మేనల్లుడి నటన చూడటం కోసం మహేష్‌బాబు తన ఫ్యామిలీతో కలిసి ప్రత్యేకంగా భలే భలే మగాడివోయ్ చిత్రాన్ని స్పెషల్ షో వేసుకొని చూడనున్నాడట...!