Advertisementt

గుణశేఖర్ చేతుల్లో బ్రూస్‌లీ అఖిల్ రిలీజ్!

Mon 07th Sep 2015 11:38 PM
gunasekhar,brucelee,akhil,ram charan,rudhramadevi  గుణశేఖర్ చేతుల్లో బ్రూస్‌లీ అఖిల్ రిలీజ్!
గుణశేఖర్ చేతుల్లో బ్రూస్‌లీ అఖిల్ రిలీజ్!
Advertisement
Ads by CJ

అక్టోబర్‌ 21వ తేదీన అక్కినేని అఖిల్‌ డెబ్యూ మూవీ అఖిల్‌ రిలీజ్‌ అవుతుందని ప్రకటించారు. అయితే అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం వాయిదా పడిందని ప్రచారం జరిగింది. దాన్ని అఖిల్‌ టీమ్‌ తిప్పి కొట్టింది. అక్టోబర్‌ 21న సినిమా రావడం ఖాయమని ప్రకటించారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. అయితే మళ్లీ అఖిల్‌ సినిమా వాయిదా ప్రమాదంలో పడింది. అక్టోబర్‌ 21న సినిమాను తీసుకురావడం కష్టమని టాలీవుడ్‌ టాక్‌. రుద్రమదేవి అక్టోబర్‌ 9న విడుదల కానుండటంతో రామ్‌చరణ్‌ నటిస్తున్న బ్రూస్‌లీ చిత్రాన్ని అక్టోబర్‌ 15 నుండి అక్టోబర్‌ 16కి షిఫ్ట్‌ చేశారట. దీంతో అఖిల్‌ సినిమా అక్టోబర్‌ చివరి వారానికి పోస్ట్‌పోన్‌ అయిందని తాజా సమాచారం. రుద్రమదేవి డేట్‌ మారడం వల్ల రెండు సినిమాల వాయిదాల పడ్డాయని ఒక వేళ రుద్రమదేవి మళ్లీ వాయిదా పడితే మాత్రం బ్రూస్‌లీ, అఖిల్‌ సినిమాలు ముందుగా చెప్పిన సమయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చరణ్‌, అఖిల్‌ సినిమాల రిలీజ్‌ డేట్లు గుణశేఖర్‌ నిర్ణయంపై ఆధారపడి ఉన్నాయని అంటున్నారు. ఈ రెండు చిత్రాలు పోస్ట్‌పోన్‌ అయితే మాత్రం ఇవి దసరా సీజన్‌ను పూర్తిగా పోగొట్టుకోవడం ఖాయం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ