ఇటీవలి కాలంలో మెగాఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలలో రామ్‌చరణ్ ఒక్కడికే స్టార్‌ఇమేజ్ వచ్చింది. ఆ తర్వాత తెరకు పరిచయం అయినా ఏ మెగాహీరోకు స్టార్ స్టేటస్ రాలేదు. అల్లుశిరీష్, సాయిధరమ్‌తేజ్, వరుణ్‌తేజ్ వంటి హీరోలు ఈ ఇమేజ్ కోసం తాపత్రయపడుతున్నారు. వీరిలో అల్లు శిరీష్‌ను పక్కనపెడితే మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్, సుప్రీంహీరో వరుణ్‌తేజ్‌లకు మాత్రం స్టార్ హోదా సాధించే లక్షణాలు ఉన్నాయి. అయితే వారికి కావాల్సిందల్లా ఒకే ఒక్క బ్లాక్‌బస్టర్. ప్రస్తుతం సాయిధరమ్‌తేజ్.. దిల్‌రాజు నిర్మాణంలో హరీష్‌శంకర్ దర్శకత్వంలో సుబ్రమణ్యం ఫర్‌సేల్ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. దీని తర్వాత దిల్‌రాజు నిర్మాణంలోనే పటాస్ ఫేమ్ అనిల్‌రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఇక ఓం త్రీడీ దర్శకుడు సునీల్‌రెడ్డి సినిమాలో కూడ సాయి నటించనున్నాడు. ఈ మూడింటిలో ఒక్క బ్లాక్‌బస్టర్ అయినా కొట్టాలని సాయిధరమ్‌తేజ్ పట్టుదలతో ఉన్నాడు. ఇక వరుణ్‌తేజ్ విషయానికి వస్తే క్రిష్ దర్శకత్వంలో ఆయన నటించిన రెండో చిత్రం కంచె పై భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు ఆయన పూరీజగన్నాథ్ దర్శకత్వంలో లోఫర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలలో తనకి ఒక్కటైనా బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందనే ఆశతో ఉన్నాడు. మరి ఈ హీరోలకు స్టార్‌స్టేటస్ ఎంతకాలానికి... ఏ రూపంలో వస్తుందో వేచిచూడాల్సివుంది!