మహేష్‌బాబుకి కన్‌ఫ్యూజన్ వస్తే ఎక్కువగా కొడతాడు. అదే సూర్యకి కన్‌ఫ్యూజన్ వస్తే ఏం చేయాలో మర్చిపోయి గజిని అవుతాడు. ఆయన గత కొంతకాలంగా అన్ని జోనర్ సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్ మాత్రం కొట్టలేకపోతున్నాడు. దీంతో ఎలాంటి సినిమాలు చేయాలనే విషయంలో సూర్యకు ఫుల్ కన్‌ఫ్యూజన్ ఉంది. ఒకప్పుడు ఆయన చేసిన ప్రయోగాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కానీ ఇప్పుడు చేస్తున్న ప్రయోగాలు మాత్రం ఆయనకు సత్ఫలితాలు ఇవ్వడం లేదు. సెవెన్త్‌సెన్స్, బ్రదర్స్, సికిందర్, రాక్షసుడు.. వంటి వైవిధ్య చిత్రాలను చేస్తున్నా.. అవ్వన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడుతున్నాయి. క్లాస్, మాస్, హర్రర్, కామెడీ.. ఇలా ఏ జోనర్‌లో చేసినా ఆయనకు ఫలితం దక్కడంలేదు. కానీ ఫ్లాప్‌లు వస్తున్నాయి కదా! అని ఆయన తన పంధాను మార్చుకోవడం లేదు. తాను నమ్మిన ప్రయోగాలకే పెద్ద పీట వేస్తున్నాడు. తాజాగా ఆయన మనం దర్శకుడు విక్రమ్‌కుమార్ డైరెక్షన్‌లో 24 అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో ఆయన సరసన సమంత నటిస్తోంది. ఈ చిత్రం కూడా టైమ్‌మెషీన్ కథ ఆధారంగా రూపుదిద్దుకొంటోంది. దీంతో ఆయన మరోసారి ఈ ప్రయోగం చేస్తుండటంతో ఇదైనా సూర్యకు హిట్‌ను అందిస్తుందా! లేదా! అన్నది చూడాలి. వాస్తవానికి ఆయన గత ఐదేళ్లలో కేవలం సింగం, సింగం2 లు మాత్రమే విజయం సాధించాయి. దాంతో సూర్య ఈసారి తనకు అచ్చివచ్చిన హరి దర్శకత్వంలో సింగం సిరీస్‌లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.