టాలీవుడ్ హీరోలు మెల్లమెల్లగా ఇతర భాషల్లోకి ప్రవేశించి అక్కడ కూడా క్రేజ్ తెచ్చుకోవడానికి నడుం బిగిస్తున్నారు. దగ్గుబాటి రానాకు బాలీవుడ్‌లో బాగానే క్రేజ్ ఉంది. దాంతో ఆయన అక్కడ ఓ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. అలాగే తమిళ స్టార్ ధనుష్ కూడా ముంబైలో ఫ్లాట్ కొన్నాడు. బాలీవుడ్‌లో జంజీర్ వంటి డిజాస్టర్ మూవీలో నటించినప్పటికీ ఎప్పటికైనా అక్కడ పేరు తెచ్చుకోవాలని భావించిన రామ్‌చరణ్ కూడా ముంబైలో సొంత ఫ్లాట్ కొని తన ఉద్ధేశ్యం చెప్పకనే చెప్పాడు. ఇక ఇప్పటివరకు ఒక్క బాలీవుడ్ సినిమాలో కూడా నటించని అల్లువారబ్బాయ్ అల్లుఅర్జున్ కూడా ముంబైలో ఓ ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేశాడట. ఆ ఇంటిని తనే సొంతంగా డిజైన్ చేయించుకున్న బన్నీ ఫ్లాట్ ఫొటోలను ఆయన సోదరుడు అల్లు శిరీష్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ దేశముదురు త్వరలో బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడని, అందుకే అక్కడ నటించకముందే దూరదృష్టితో అక్కడ ఫ్లాట్ కొనుగోలు చేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.