Advertisementt

అఖిల్ కోసం పవన్ ను దువ్వుతున్నాడు!

Sun 06th Sep 2015 04:50 AM
akhil movie,akhil,pawan kalyan,nithin,sardhar  అఖిల్ కోసం పవన్ ను దువ్వుతున్నాడు!
అఖిల్ కోసం పవన్ ను దువ్వుతున్నాడు!
Advertisement
Ads by CJ

పవన్‌కళ్యాణ్‌ సాధారణంగా ఏ ఫంక్షన్స్‌కు రాడు. మరీ ముఖ్యమనిపిస్తే తప్ప ఆయన చాలా లో ప్రొఫైల్‌ మెయిన్‌టెయిన్‌ చేస్తాడు. కాగా పవన్‌కు యంగ్‌ హీరో నితిన్‌ అంటే ప్రత్యేకమైన అభిమానం. అందుకే గతంలో ఆయన నటించిన చిత్రాల ఆడియో వేడుకలకు వచ్చాడు. ఆయా చిత్రాలు మెగాభిమానుల ఆదరణతో మంచి విజయాలు సాధించి నితిన్‌ను హీరోగా నిలబెట్టాయి. కాగా ఇప్పుడు నితిన్‌ నిర్మాతగా అక్కినేని ఫ్యామిలీ నయా హీరో అఖిల్‌ నటిస్తున్న డెబ్యూ మూవీ అఖిల్‌ ఆడియో వేడుకను అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్బంగా సెప్టెంబర్‌ 20న విడుదలకు గ్రాండ్‌గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా ఈ ఆడియోకు పవన్‌కళ్యాణ్‌ను ముఖ్య అతిథిగా రప్పించాలని నితిన్‌ ప్రయత్నాలు చేస్తున్నాడట. అయితే తన ఫ్యామిలీ ఫంక్షన్స్‌కు కూడా రాని తను అఖిల్ ఆడియో వేడుకకు వస్తే తప్పుగా అపార్థం చేసుకునే అవకాశం ఉన్నట్లు పవన్‌ ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. అఖిల్‌ టీజర్‌ను సల్మాన్‌ఖాన్‌ చేత ఓపెనింగ్‌ చేయించిన నాగార్జున మనసులో మాత్రం ఏముందో తెలియడం లేదని అంటున్నారు. మరి అఖిల్‌ వేడుకకు సర్దార్‌ వస్తాడా? రాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ