Advertisementt

ఈగ2 కన్‌ఫర్మ్‌ అంట నిజమేనా!

Sun 06th Sep 2015 12:22 AM
rajamouli,nani,eega,eega2,bhale bhale magadivoy  ఈగ2 కన్‌ఫర్మ్‌ అంట నిజమేనా!
ఈగ2 కన్‌ఫర్మ్‌ అంట నిజమేనా!
Advertisement
Ads by CJ

బాహుబలి1 విడుదలై ఘనవిజయం సాధించిన తర్వాత బాహుబలి2 ను తెరకెక్కించడానికి రాజమౌళి సిద్దమయ్యాడు. కాగా ఆయన గతంలో తీసిన సూపర్‌హిట్‌ మూవీ ఈగ కు కూడా సీక్వెల్‌గా ఈగ2 తీయనున్నాడని అప్పటి నుండే వార్తలు వస్తున్నాయి. అయితే ఇవి కేవలం గాలి వార్తలుగా చాలామంది భావించారు. అయితే ఈగ2 విషయాన్ని హీరో నాని కన్‌ఫర్మ్‌ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ఈగ2 తీయాలన్న ఆలోచన రాజమౌళి గారికి వచ్చింది. ఇది పక్కా. బాహుబలి2 పూర్తయ్యాక ఆ సినిమా ఉండొచ్చు. అందులో నా పాత్ర ఏంటన్నది? ఇప్పుడే తెలీదు... అన్నాడు. ఈగ2 లో నటిస్తున్నారా? అని నానిని అడిగినప్పుడు ఆయన ఇలా స్పందించారు. ఇక 14రీల్స్‌ పతాకంపై తాను నటిస్తున్న చిత్రానికి సంబంధించి నాని మాట్లాడుతూ... ఈ చిత్రంలో నేను బాలయ్యగారికి అభిమానిగా నటిస్తున్నాను. చేతిపై జై బాలయ్య అనే టాటూ ఉంటుంది. దాంతో అందరూ ఆదే ఈ సినిమా టైటిల్‌ అనుకొంటున్నారు. కానీ టైటిల్‌ అది కాదు..త్వరలో ఆ సినిమా టైటిల్‌ను ప్రకటిస్తాం... అని తెలిపాడు. కాగా నాని నటించిన భలే భలే మగాడివోయ్‌ చిత్రం విడుదలై మంచి పాజిటివ్‌ టాక్‌తో రన్‌ అవుతుండటంతో ఈమధ్య పెద్దగా హిట్‌ లేని నానికి మరోసారి మంచి హిట్టు లభించిందనే చెప్పవచ్చు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ