టాలీవుడ్‌లోని యంగ్ టాలెంటెడ్ స్టార్ డైరెక్టర్లందరూ ఏడాదికి ఒకటి అరా సినిమాలు తీస్తుంటే పూరీజగన్నాథ్ మాత్రం ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో ఔరా అనిపిస్తాడు. ఆయన టెంపర్ చిత్రాన్ని వేగంగా పూర్తి చేయడానికి, పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్‌కి ఎక్కువ సమయం పట్టకుండా త్వరగా సినిమా విడుదల చేయడానికి ఏ రోజు షూటింగ్‌ను ఆరోజే ఎడిటింగ్ చేయడం అనే కొత్త విధానాన్ని టెంపర్ చిత్రంతో శ్రీకారం చుట్టాడు. తాజాగా ఆయన వరుణ్‌తేజ్ హీరోగా రూపొందిస్తున్న లోఫర్ చిత్రాన్ని కూడా టెంపర్ స్టైల్‌ను ఫాలో అవుతూ ఏ రోజు షూటింగ్ జరిపిన సీన్స్‌ను ఆ రోజే ఎడిటింగ్ పనులు పూర్తి చేస్తూ శరవేగంగా సినిమాను పూర్తి చేస్తున్నాడు. ఇటీవల వరకు రాజస్థాన్‌లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం త్వరలో గోవా షెడ్యూల్‌కు వెళ్లనుంది...!