ఓవైపు అక్కినేని అఖిల్ తొలి సినిమా నిర్మాణంలో బిజీగా ఉన్న నితిన్ త్వరలో త్రివిక్రమ్ సినిమాతో మేకప్ వేసుకోనున్నాడు. ఇప్పటికే వేణు అనే కొత్త దర్శకుడిని ఆయన లైన్‌లో పెట్టుకున్నాడు. తాజాగా రౌడీఫెలో దర్శకుడు కృష్ణచైతన్య దర్శకత్వంలో నటించేందుకు ఓకే చేసేశాడు. పాటల రచయితగా కెరీర్ ప్రారంభించిన కృష్ణచైతన్య నారా రోహిత్ రౌడీ ఫెలో తో మెగాఫోన్ చేతబట్టాడు. సినిమా పెద్దగా ఆడకపోయినా టాలెంట్ ఉంది అనే పొగడ్తను అందుకొన్నాడు. ఆయన నితిన్‌కు ఓ స్టోరీ చెప్పడం.. దానికి నితిన్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. త్రివిక్రమ్ సినిమా పూర్తయిన వెంటనే కృష్ణచైతన్య సినిమాను లైన్‌లోకి తీసుకొచ్చేందుకు నితిన్ రెడీ అవుతున్నాడు.