నిర్మాత బండ్ల గణేష్ ఎంతటి వాళ్లనైనా భలే పట్టేస్తాడు. మాటలతో బురిడీ కొట్టిస్తాడు. గారడీ చేసి మాయ చేస్తాడు. ఇప్పటికే పవన్‌తో పాటు ఎన్టీఆర్, రామ్‌చరణ్ వంటి వారితో సినిమాలు తీసిన ఈయన మెగా కాంపౌండ్ నుండి నందమూరి కాంపౌండ్‌కు వచ్చాడు. తాజాగా ఆయన అక్కినేని కాంపౌండ్‌లోకి దూరడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పటివరకు నాగార్జున, నాగచైతన్యలకు అచ్చిరాని మాస్ ఇమేజ్‌ను తొలి సినిమా విడుదలకు ముందే సాధిస్తోన్న అఖిల్‌తో సినిమా చేయాలని ఆశపడుతున్నాడు. తాజాగా ఆయన నాగార్జునను కలిసి తనకు అఖిల్ రెండో లేదా మూడో చిత్రం చాన్స్ ఇవ్వమని అడిగాడట. ఆల్‌రెడీ బండ్లగణేష్ దగ్గర కొరటాల శివ కాల్షీట్స్, అడ్వాన్స్ ఉన్నాయి. దాంతో కొరటాల శివను చూపించి నాగ్ నుండి అఖిల్ రెండో లేదా మూడో మూవీ చాన్స్ చేజిక్కించుకునేందుకు బండ్ల తెలివిగా పావులు కదుపుతున్నాడట.