తమిళంలో సూపర్ హిట్ అయిన చిత్రాల రీమేక్ రైట్స్ తీసుకొని తెలుగులో సినిమాలు చేయడం చాలా కాలంగా ఇండస్ట్రీలో జరుగుతున్న విషయమే. అయితే రీసెంట్ మెగా ఫ్యామిలీ హీరో రామ్ చరణ్ కూడా ఓ రీమేక్ చిత్రంలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడట. ప్రస్తుతం రామ్ చరణ్, శ్రీనువైట్ల డైరెక్ట్ చేస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. తమిళంలో వారం రోజుల క్రిందట విడుదలయ్యి మంచి హిట్ టాక్ తో దూసుకుపోతున్న తాని ఒరువన్ అనే చిత్రాని తెలుగులో తెరకెక్కించడానికి చరణ్ సిద్ధమవుతునట్లు సమాచారం. తమిళంలో డైరెక్ట్ చేసిన రాజానే తెలుగులో కూడా డైరెక్ట్ చేయనున్నాడట. ఈ చిత్రానికి నిర్మాతగా ఎన్.వి.ప్రసాద్ వ్యవహరించనున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయనున్నారు.