దృశ్యం, గోపాల గోపాల తర్వాత విక్టరీ వెంకటేష్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఆయన త్వరలో ఓనమాలు, మళ్లీమళ్లీ ఇదిరాని రోజు చిత్రాల దర్శకుడు క్రాంతిమాధవ్ డైరెక్షన్‌లో ఓ చిత్రం చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. వైవిధ్యమైన కథ, ఫీల్‌గుడ్ మూవీగా ఈ చిత్రం రూపొందనుంది. గతంలో వెంకీతో షాడో చిత్రాన్ని నిర్మించిన పరుచూరి ప్రసాద్ నిర్మాతగా ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15న గ్రాండ్‌గా ఓపెనింగ్ జరపడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంతోషం సగం బలం అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్ చేసినట్లు సమాచారం. మరి ఇంతకాలం గ్యాప్ తర్వాత వెంకీ నటిస్తున్న చిత్రం కావడంతో అందరిలో ఈ చిత్రం ఆసక్తిని కలిగిస్తోంది.