జూనియర్ ఎన్టీఆర్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ లండన్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి నాన్నకు ప్రేమతో అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఈ టైటిల్ ఎన్టీఆర్ అభిమానులకు నచ్చలేదట. చాలా సాఫ్ట్‌గా ఉన్న ఈ టైటిల్‌ను మార్చాలని ఆయన అభిమానులు కోరుతున్నారని సమాచారం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర పేరు అభిరామ్. దీంతో ఎన్టీఆర్ పాత్ర పేరునే ఈ చిత్రానికి టైటిల్‌గా పెడతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏ విషయం వినాయక చవితి రోజు క్లారిటీ రానుంది. ఆ రోజున టైటిల్ లోగోను విడుదల చేయనున్నారు. కాగా ఈ చిత్రం ప్రీ బిజినెస్ అద్భుతంగా జరిగిందని ట్రేడ్‌టాక్. కాగా ఈ చిత్రం శాటిలైట్ హక్కులను జెమిని చానెల్ 10.5కోట్లకు సొంతం చేసుకుందని అంటున్నారు. మొత్తానికి టెంపర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో వేచిచూడాల్సివుంది...