Advertisementt

కమల్ రేంజ్ లో ఆర్య, అనుష్క ల రొమాన్స్!

Fri 04th Sep 2015 06:11 AM
size zero,kshatriyaputhrudu,kamal hassan,anushka  కమల్ రేంజ్ లో ఆర్య, అనుష్క ల రొమాన్స్!
కమల్ రేంజ్ లో ఆర్య, అనుష్క ల రొమాన్స్!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం పాత హిట్‌ పాటల రీమిక్స్‌ హవా నడుస్తోంది. పివిపి సంస్థ అనుష్క ప్రదానపాత్రలో రూపొందిస్తున్న సైజ్‌జీరో చిత్రంలో కూడా ఓ పాట రీమిక్స్‌ ఉంది. సన్నజాజి పడక... అంటూ సాగే ఈ పాట కమల్‌ నటించిన క్షత్రియపుత్రుడు చిత్రంలోని పాపులర్‌ నెంబర్‌. ఈ పాటకు స్వరకర్త ఇళయరాజా. కాగా ఈ పాటను కీరవాణి స్వరకల్పనలో రీమిక్స్‌ చేసి సైజ్‌జీరో చిత్రంలో వాడుకొంటున్నారట. ఆర్య, అనుష్కల మధ్య వచ్చే ఈ పాటను ఎంతో రొమాంటిక్‌గా చిత్రీకరించారని సమాచారం. ఈ సినిమాకు ఈ పాట మంచి ప్లస్‌ అవుతుందని కూడా యూనిట్‌ చెబుతోంది. కాగా అక్టోబర్‌ 2న విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్‌ కోవెలమూడి దర్శకుడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ