Advertisementt

కంచె పై మహేష్‌ ఎఫెక్ట్‌ పడనుందా..!

Fri 04th Sep 2015 06:07 AM
kanche movie,varun tej,mahesh babu tweet  కంచె పై మహేష్‌ ఎఫెక్ట్‌ పడనుందా..!
కంచె పై మహేష్‌ ఎఫెక్ట్‌ పడనుందా..!
Advertisement
Ads by CJ

మెగాహీరో వరుణ్‌తేజ్‌ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కంచె. ఈ చిత్రం ట్రైలర్‌ ఇటీవలే విడుదలై బ్రహ్మాండమైన రెస్పాన్స్‌ను సొంతం చేసుకొంటోంది. దీంతో అందరిలోనూ ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. తాజాగా సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు కూడా ఈ ట్రైలర్‌పై స్పందించాడు. ఆయన మాట్లాడుతూ... కంచె ట్రైలర్‌ స్టన్నింగ్‌గా ఉంది. ఎంటైర్‌ టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌.. అంటూ ట్వీట్‌ చేశాడు. మహేష్‌లాంటి స్టార్‌ హీరో కూడా కంచె ట్రైలర్‌ను చూసి మెచ్చుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మహేష్‌ కామెంట్స్‌ వల్ల ఆయన అభిమానులు కూడా కంచె సినిమా చూడటానికి ఆసక్తి చూపుతారనడంలో సందేహం లేదు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ