Advertisementt

సర్దార్‌ లో కత్తిలాంటి పోరి..!

Fri 04th Sep 2015 05:40 AM
sardhar gabbar singh,pawan kalyan,lakshmi roy  సర్దార్‌ లో కత్తిలాంటి పోరి..!
సర్దార్‌ లో కత్తిలాంటి పోరి..!
Advertisement
Ads by CJ

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ హీరోగా బాబి దర్శకత్వంలో ఈరోస్‌ సంస్థతో కలిసి నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పవన్‌కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ కలిసి నిర్మిస్తున్న చిత్రం సర్దార్‌ గబ్బర్‌సింగ్‌. కాగా ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. దేవిశ్రీ సినిమా అంటే అందులో అదిరిపోయే ఐటం సాంగ్‌ ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. గబ్బర్‌సింగ్‌ లో కెవ్వుకేక... తరహాలో దాన్ని మించిన విధంగా ఈ చిత్రంలో ఈ ఐటం ఉంటుందిట. కాగా ఈ పాటలో లక్ష్మీరాయ్‌ పవన్‌తో కలిసి నర్తించనుంది. సాంగ్‌తో పాటు ఓ ముఖ్యమైన పాత్రలో నేను నటిస్తున్నాను. ఇంట్రెస్టింగ్‌ అండ్‌ ఇంపార్టెంట్‌గా నా పాత్ర ఉంటుంది. చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. పవన్‌తో కలిసి నేను ఈ సినిమాలో ఫస్ట్‌టైమ్‌ డాన్స్‌ చేయడం మీరు చూస్తారు.. అంటూ లక్ష్మీరాయ్‌ చెప్పుకొచ్చింది. మరి ఈ చిత్రంలో ఐటం పాపగా ఆమె ఎంతవరకు న్యాయం చేస్తుందో చూడాలి....

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ