’మిర్చి, శ్రీమంతుడు’ వంటి సూపర్‌హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ కొరటాల శివ. ఇప్పటికే ద్వితీయ విఘ్నం దాటేసిన ఆయన ఇప్పుడు హ్యాట్రిక్ మూవీకి రెడీ అవుతున్నాడు. కానీ ఆయన జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తాడా? లేక అల్లుఅర్జున్‌తో ముందు చేస్తాడా? అనేది ఇప్పటికీ హాట్‌టాపిక్‌గా ఉంది. తాజాగా ఈ జాబితాలోకి మరో హీరో వచ్చిచేరాడు. అతనే పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్. పవన్ త్వరలో దాసరి నిర్మాతగా ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం దర్శకత్వ బాధ్యతలను ఎవరికి అప్పగించనున్నారు? అనే విషయంలో ఇద్దరు డైరెక్టర్స్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారే డాలీ, త్రివిక్రమ్‌శ్రీనివాస్. అయితే తాజాగా దాసరి దృష్టిలో కొరటాల శివ పడ్డాడట..! ’శ్రీమంతుడు’ చిత్రం చూసి ఓ సందేశాన్ని ఇంత కమర్షియల్‌గా కూడా చెప్పవచ్చా? అనే విధంగా తెరకెక్కించిన కొరటాల శివ పనితనాన్ని మెచ్చుకున్న దాసరి వెంటనే కొరటాలకు కబురు పెట్టాడనేది సమాచారం. దాసరి అడిగితే ఏ దర్శకుడు కాదనకపోవచ్చు.. సో.. కొరటాల దగ్గర పవన్‌కు తగ్గ స్టోరీ ఉంటే ... ఇక కొరటాలనే ఫైనల్ చేసే అవకాశం ఉందని ఫిల్మ్‌సర్కిల్స్‌లో వినపడుతోంది.