ఒక ఘనవిజయం కొందరికి బూస్ట్‌గా పనిచేస్తుంది. అదే మరికొందరికి మాత్రం ఎక్కడలేని ఓవర్ కాన్ఫిడెన్స్‌ను తెచ్చిపెడుతుంది. ఈ రెండో కోవకు చెందిన డైరెక్టర్‌గా సురేందర్‌రెడ్డిని అందరూ జమ వేస్తూన్నారు. రేసుగుర్రం తెచ్చిన మితిమీరిన ఆత్మవిశ్వాసంతో 20కోట్లలో తీయాల్సిన చిత్రానికి 40కోట్లు ఖర్చుపెట్టించాడు. కథని మాత్రం సరైన విధంగా చూపించడంలో విఫలమవ్వటంతో కిక్2 డిజాస్టర్‌గా నిలుస్తోంది. ఇప్పటికే రవితేజ సురేందర్‌రెడ్డిపై తీవ్రంగానే విరుచుకుపడ్డాడు. తాజాగా నిర్మాత కళ్యాణ్‌రామ్ సైతం సురేందర్‌రెడ్డి అంటే అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడట.
అప్పటికీ సెకండాఫ్‌లో దమ్ము లేదని, తిరిగి రీషూట్ చేయమని కళ్యాణ్‌రామ్ ఎంత కోరినా కూడా అన్ని బ్రహ్మాండంగా కుదిరాయి.. రీషూట్ అవసరమే లేదని కొట్టిపారేశాడట. ఇండస్ట్రీ మొత్తం కిక్2 వైఫల్యానికి సురేందర్‌రెడ్డినే బ్లేమ్ చేస్తోంది. అల్లుఅర్జున్‌తో రేసుగుర్రం విజయం వచ్చింది కదా.. అని మితిమీరితే చివరకు సురేందర్‌రెడ్డిలా కాకతప్పదని ఫిల్మ్‌సర్కిల్స్‌లో వినిపిస్తున్నమాట... మరి ఈ నేపథ్యంలో సురేందర్‌రెడ్డితో రామ్‌చరణ్ తన తదుపరి చిత్రం చేస్తాడా.. లేదా.. అనేది కూడా సందిగ్దంలో పడిపోయింది.