Advertisementt

నందమూరి ఫ్యాన్స్ కీ.. పండగ రాబోతోంది!

Wed 02nd Sep 2015 09:48 AM
ntr,balakrishna,ma nannaku prematho,dictator  నందమూరి ఫ్యాన్స్ కీ.. పండగ రాబోతోంది!
నందమూరి ఫ్యాన్స్ కీ.. పండగ రాబోతోంది!
Advertisement
Ads by CJ

రాబోయే వినాయకచవితి నందమూరి ఫ్యాన్స్‌కు ఒకేసారి బోలెడు సంతోషాన్ని కలిగించనుంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌, సుకుమార్‌ల డైరెక్షన్‌లో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాతగా రూపొందుతున్న భారీ చిత్రం నాన్నకు ప్రేమతో టైటిల్‌ లోగోను వినాయక చవితికి విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. టీజర్‌ను మాత్రం విజయదశమి కానుకగా అక్టోబర్‌ 22న విడుదల చేయాలని నిర్ణయించారు. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 99వ చిత్రం డిక్టేటర్‌ షూటింగ్‌ కూడా వేగంగా జరుగుతోంది. ఈ చిత్రం తొలి టీజర్‌ను సెప్టెంబర్‌ 17న వినాయక చవితి సందర్బంగా రిలీజ్‌ చేయనున్నారు. మొత్తానికి రాబోయే వినాయకచవితి పండుగతో పాటు ఎన్టీఆర్‌ సినిమా టైటిల్‌ లోగో, బాలయ్య డిక్టేటర్‌ తొలి టీజర్ల రూపంలో నందమూరి అభిమానులకు మరో రెండు పండగలు కలిసి వస్తుండటంతో నందమూరి అభిమానులు ఎంతో ఆనందంగా, ఉత్సుకతగా ఎదురుచూస్తూన్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ