Advertisementt

యువహీరోల వార్‌లో విజయం ఎవరిది?

Tue 01st Sep 2015 07:08 AM
maruthi,young heroes,bhale bhale magadivoy,dynamite,deva katta  యువహీరోల వార్‌లో విజయం ఎవరిది?
యువహీరోల వార్‌లో విజయం ఎవరిది?
Advertisement
Ads by CJ

మారుతి దర్శకత్వంలో గీతాఆర్ట్స్‌ 2, యువి క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'భలే భలే మగాడివోయ్‌'. నాని, లావణ్యత్రిపాఠి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సెన్సార్‌ వారు క్లీన్‌ యు సర్టిఫికేట్‌ ఇచ్చారు. ఈ చిత్రం సెప్టెంబర్‌4న విడుదలకు సిద్దమవుతోంది. వాస్తవానికి మారుతి సినిమాలకు బూతు అనే బ్రాండ్‌ ఉంది. ఆయన నుండి వచ్చిన సినిమాలు అటువంటివి. దాంతో ఆయనకు ఆ చెడ్ద పేరు ముద్రపడిపోయింది. కాగా అల్లుశిరీష్‌తో తీసిన 'కొత్తజంట' సినిమాతో బూతు అనే బ్రాండ్‌ను చెరిపేసే సినిమాలను తీయాలని ఆయన పట్టుపట్టాడు. ఆ చిత్రానికి 'యు/ఎ' సర్టిఫికేట్‌ సంపాదించాడు. అప్పటి నుండి మారుతిలో మార్పు వచ్చిందని అంటున్నారు. ఎలాగైనా క్లీన్‌యు సినిమా తీస్తానని చెప్పిన మారుతి 'భలే భలే మగాడివోయ్‌'తో దానికి సాధించాడు. ఇక అదేరోజు వస్తున్న మరో చిత్రం మంచు విష్ణు నటించిన 'డైనమైట్‌'. దేవకట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళంలో వచ్చిన 'అరిమనంబి'కి రీమేక్‌. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌. ఈ చిత్రానికి సెన్సార్‌ వారు యు/ఎ సర్టిఫికేట్‌ ఇచ్చారు. దేవకట్టా టేకింగ్‌, విష్ణు నటన, ఫైట్‌మాస్టర్‌ విజయ్‌ అందించిన యాక్షన్‌ సీక్వెన్స్‌లను ఈ చిత్రానికి హైలైట్‌గా చెబుతున్నారు. అందునా ఈ చిత్రం దర్శకత్వంలో మంచు విష్ణు అండ్‌ ఫ్యామిలీ ఏమాత్రం కల్పించుకోకుండా మొత్తాన్ని దేవకట్టా చేతిలోనే పెట్టారనే టాక్‌ వినిపిస్తోంది. దీంతో ఈ చిత్రంపై కూడా బాగానే అంచనాలు ఉన్నాయి. మరి వచ్చే శుక్రవారం విడుదలయ్యే ఈ రెండు చిత్రాలలో ఏది పైచేయి సాధిస్తుందో వేచిచూడాల్సివుంది!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ