ఈరోజు(29) అక్కినేని నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా నాగార్జున హీరోగా నటించిన 'సోగ్గాడే చిన్ని నాయనా' ఫస్ట్‌లుక్, నాగచైతన్య హీరోగా చేసిన 'సాహసమే ఊపిరిగా సాగిపో' ఫస్ట్‌లుక్, అఖిల్ ఫస్ట్ మూవీ 'అఖిల్' ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతాయని వారం రోజులుగా విపరీతంగా పబ్లిసిటీ చేసిన నాగార్జున చివరికి అభిమానులకు నిరాశను మిగిల్చారు.
ఈ ముగ్గురి ఫస్ట్ లుక్స్‌ని భారీ ఎత్తున ఓ ఫంక్షన్‌లో రిలీజ్ చేస్తారని అభిమానులంతా ఆశపడ్డారు. అయితే వాళ్ళు అనుకున్న దానికి పూర్తి రివర్స్‌లో జరిగింది. ఎలాంటి ఫంక్షన్ లేకుండా డైరెక్ట్‌గా ఆ మూడు సినిమాల ఫస్ట్‌లుక్‌లను, టీజర్స్‌ను విడుదల చేశారు. టీజర్స్ చాలా బాగున్నాయని అభిమానులు ఓ పక్క చెప్తూనే, మరో పక్క తమ అభిమాన హీరోలను ఒకే వేదికపై చూడాలని, మూడు ఫస్ట్‌లుక్‌లు తమ సమక్షంలో జరగాలని ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వున్న అభిమానులకు ఒక్కసారిగా నీరసం ఆవహించింది. టీజర్స్ అందరికీ అద్భుతం అనిపించడంతో తాత్కాలికంగా తమ బాధని పక్కన పెట్టి టీజర్స్‌ని ఎంజాయ్ చేస్తున్నారు.